ఉషశ్రీ సంస్కృతి సత్కార సభ తేదీ: 15 ఆదివారం, మార్చి, 2020 వేదిక: యాదాద్రి భవన్‌ కల్యాణ మండపం, బర్కత్‌పురా, హైదరాబాద్‌

రేడియో వాల్మీకిగా ప్రసిద్ధి చెందిన ఉషశ్రీ రామాయణమహాభారతాలను వర్తమాన సమాజంతో పోలుస్తూ, అందరికీ అర్థమయ్యే సులభ శైలిలో వివరించారు. అదే మార్గంలో నడుస్తున్న గరికిపాటి నరసింహారావు స్తోత్రాలను సామాజిక కోణంలో విశదపరుస్తున్నారు. ఉషశ్రీ 92 వ జయంతి పురస్కరించుకుని ఉషశ్రీ మిషన్‌ ఈ సంవత్సరం ప్రముఖ సహస్రావధాని డా.గరికిపాటి నరసింహారావుగారిని ‘ఉషశ్రీ సంస్కృతి సత్కారం’తో సన్మానిస్తున్నారు. ఇది పదో పురస్కారం. ఇంతవరకు డా. దాశరథి రంగాచార్య, డా. పాలపర్తి శ్యామలానదం ప్రసాద్, డా. మాడుగుల నాగఫణిశర్మ, డా. బేతవోలు రామబ్రహ్మం, డా. రాళ్లబండి కవితా ప్రసాద్, డా. పుల్లెల శ్రీరామచంద్రుడు, గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, చిరంజీవి తాతా సందీప శర్మ, డా. ఎన్‌. అనంతలక్ష్మి… గార్లకు అందించాం. ఈ సంవత్సరం గరికిపాటికి ఈ సత్కారం అందిస్తున్నట్లు ఉషశ్రీ మిషన్‌ తెలియచేస్తోంది.