ఘనంగా డా. కంభం పాటి స్వయం ప్రకాష్ జయంతి ఉత్సవాలు

 ఘనంగా డా. కంభం పాటి స్వయం ప్రకాష్ జయంతి ఉత్సవాలు

రీసెంట్ గా ప్రముఖ సెక్సాలజిస్ట్ స్వర్గీయ  డా.కంభం పాటి స్వయం ప్రకాష్ గారి 56 వ జయంతి ఉత్సవాలు హైదరాబాద్ లో కంభంపాటి స్వయం ప్రకాష్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా  జరిగాయి. ఈ వేడకకు మాజీ గవర్నర్ కె.రోశయ్య గారు హాజరయ్యారు. విజయవాడకు చెందిన డా.రాజేంద్రప్రసాద్ మరియు డా.రమ దంపతులకు సంతాన సాపల్య రంగంలో విశేష కృషికి అవార్డ్ ని ఈ వేడుకలో అవార్డ్ లు రోశయ్యగారి చేతుల మీదుగా అందచేసారు.   అలాగే ఇంటర్ స్కూల్ లిటరరీ కాంపిటేషన్ లో విజేతలైన విధ్యార్దులకు నగదు బహుమతి, సర్టిఫికేట్స్ అందచేసారు.  డా. బిఆర్ కేఆర్ గవర్నమెంట్ ఆయుర్వేద కళాశాలకు చెందిన వైద్య విద్యార్ది మినాజ్ అహ్మద్ కు రస శాస్త్రంలో ప్రముదముడుగా రావటంతో బహుమతి అందచేసారు.అప్నా ఘర్ స్వచ్చంద సంస్దకు ట్రస్ట్ తరుపున చెక్ లు అందచేసారు. ఎందరో భార్యాభర్తలు మధ్య దాంపత్య జీవితంలోని అవగాహనా లోపాల్ని తన సలహా సూచనలతో ..వైద్యంతో చక్కదిద్ది పలు సంసారాలతో సుఖమయం చేసిన సెక్స్ స్పెషలిస్ట్ నిపుణుగా పేరు తెచ్చుకున్న డాం.కంభం పాటి స్వయం ప్రకాష్ 27 ఆగస్టు 2010 మరణించారు.  ఆయన పలు టీవి ఛానెళ్లు, పత్రికలు నిర్వహించిన ప్రత్యేక లైంగిక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నాలుగు లైంగిక విజ్ఞాన చిత్రాల్లో కూడా ఆయన సెక్సాలజీ పేరుతో తొమ్మిది  పుస్తకాలు రచించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.